వీడియో లోడ్ అవుతోంది
ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
పాపులను రక్షించి, వారిని తనతో సమాధాన పరచడానికి "దేవుడు"
మెస్సయ్యను పంపుతాడని, చాలాకాలం క్రితమే ప్రవక్తలు లేఖనాలలో తెలియజేశారు.
యేసే ఆ రక్షకుడని ఆయన జీవితం ఋజువుచేస్తుంది.
“ఇదిగో, కన్యక గర్భవతియై కుమారుని కనును” అని యెషయా ప్రవక్త ప్రవచించాడు.
దేవుని శక్తిచే కన్యయైన మరియ గర్భము ధరించి యేసుకు జన్మనిచ్చింది.
లేఖనాలలో వ్రాయబడినట్లు, దేవుడు ‘నా కుమారుడు’ అని చెప్పిన మెస్సయ్య ఈయనే అని చెప్పడానికి,
ఆశ్చర్యకరమైన ఆయన జననమే నిదర్శనం.
జనులు యేసును చూచినపుడు, దేవుని స్వభావాన్ని మరియు శక్తిని చూశారు.
ఆయన జనులను స్వస్థపరచి, వారి పాపములను క్షమించి, వారికి నిత్యరాజ్యమును అనుగ్రహించెను.
యేసు మానవాళి కొరకు బాదించబడి, తన ప్రాణమును బలిగా అర్పించెను.
“నా ప్రాణము పెట్టుటకును, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు” అని క్రీస్తుయేసు చెప్పెను.
ఆయన మరణమును జయించి, మరణం కన్నా... తన శక్తి గొప్పదని నిరూపించాడు.
తన జీవితం ద్వారా ప్రవక్తల లేఖనాలను నెరవేర్చి, దేవుని పరిశుద్ధ వాక్యము లోపము లేనిది, నిత్యమైనదని యేసు ఋజువుచేశాడు.
యేసు దేవుని వాక్యము. యేసు ద్వారా దేవుడు తనను తాను ఈ లోకమునకు బయలుపరచుకొన్నాడు.
దేవుడు మొదటగా స్త్రీపురుషులను సృజించినపుడు, సమృద్దియైన జీవమును వారికి అనుగ్రహించెను.
అయితే వారు దేవుని నమ్మని వారై, ఆయన ఆజ్ఞకు అవిధేయులయ్యారు.
“అందరు పాపము చేశారు.” “పాపానికి వచ్చే ప్రతిఫలం – మరణం.” అని లేఖనము చెప్తుంది.
పాపులు దేవునితో సంబంధము కలిగియుండలేరు.
అయితే, అబ్రహాము కుమారుని స్థానంలో చనిపోవడానికి ఒక పోట్టేలునిచ్చినట్లుగానే,
ఆదాము సంతతి స్థానములో మరణించడానికి దేవుడు యేసును పంపించాడు.
యేసునందు విశ్వాసముంచిన వారు దేవుని సన్నిధికి రాగలుగునట్లు దేవుడు ఈ కార్యమును చేశాడు.
కనుక యేసునందు విశ్వాసముంచిన వారు నరక శిక్షను తప్పించుకొని, దేవునితో నిత్యం జీవిస్తారు.
యేసు, పునరుత్థానుడైన తర్వాత, “తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి,
దేవునివైపు తిరుగు వారికి పాప క్షమాపణ గలదని, సకల జనులకు తెలియచేయుడి”.
అంతేకాక, తనను వెంబడించేవారికి నిత్యం తోడైయుండి, వారిని సర్వసత్యములోనికి నడిపించడానికి,
దేవుని మార్గములో నడవడానికి వారికి తగిన శక్తినిచ్చే పరిశుద్ధాత్మను పంపిస్తానని తన శిష్యుల ద్వారా చెప్పాడు.
పాపాత్మురాలైన స్త్రీ, పశ్చాత్తాపపడి, యేసును వెంబడించడం మొదలు పెట్టినప్పుడు, “నీ పాపములు క్షమింపబడియున్నవి.
నీ విశ్వాసము నిన్ను రక్షించెను” అని యేసు ఆమెతో అన్నాడు.
యేసునందు విశ్వాసముంచుట ద్వారా ఎవరైనా దేవుని కృప చేత రక్షణ పొందవచ్చు. పాపములను క్షమించే అధికారం యేసుకు ఉన్నది.
యేసును వెంబడించాలని నిర్ణయించుకున్నవారు, ఈ మాటలద్వారా
తమ విశ్వాసమును వ్యక్త పరచి ఆయనతో తమ సంబంధాన్ని ప్రారంభించవచ్చు.
ఓ దేవా, నీవు పరిశుద్ధుడవు. నన్ను ప్రేమించినందుకు మీకు వందనాలు.
మీ ఆజ్ఞలను అతిక్రమించి, అవిధేయుడనై మీకు విరోధంగా పాపం చేసినందుకు నన్ను క్షమించండి.
నా స్థానంలో సిలువపై మరణించడానికి యేసును పంపినందుకు వందనాలు.
ఆయన మరణించి తిరిగి లేచినందుకు వందనాలు. నా పాపముల కొరకైన శిక్షను ఆయన భరించినందుకు వందనాలు.
ఆ యేసును నా రక్షకునిగా, ప్రభువుగా నా జీవితములోనికి స్వీకరిస్తున్నాను. నీ మార్గములో నడవాలని కోరుకుంటున్నాను.
నా పాపములు క్షమించినందుకు నీకు వందనాలు. నేను నిరంతరము మీ రాజ్యములో
మీతో ఉండగలుగునట్లు నాకు మార్గము తెరచినందుకు మీకు వందనాలు.
నాకు తోడైయుండి, మీ మార్గములో నన్ను నడుపునట్లు మీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి.
నా పూర్ణ హృదయముతో మిమ్మును ప్రేమించడానికి,
మీకిష్టమైనట్లుగా జీవించడానికి కావలసిన శక్తిని ఆయన నాకు అనుగ్రహించును గాక.
లోకమందంతటా, ప్రజలందరూ మిమ్మును స్తుతించుదురు గాక. ఆమెన్
“నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును”
అని యేసు తనను వెంబడించే వారిని గూర్చి చెప్పారు. యేసును వెంబడించేవారు, క్రమంగా కలుసుకుంటారు.
ప్రతి రోజూ వారు ఆయనతో మాట్లాడతారు. ఆయన వాక్యాన్ని చదువుతారు. ఆయన మాదిరిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు.
ఇంకా ఇతరులకు యేసును గూర్చి చెప్తారు.
వారి హృదయాలలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా యేసు వారిని బలపరచి నడిపిస్తాడు.
“పరలోకమందును, భూమియందును నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది....
యుగసమాప్తి వరకు సదాకాలము మీకు తోడై యున్నాను”
అని పరలోకములోని తన సింహాసనమునకు మేఘముపై ఎక్కి వెళ్లకమునుపు యేసు చెప్పిన మాటను
వారు జ్ఞాపకముంచుకుంటారు.