భాగం
Birth of Jesus
4 నిమి.FHD
Relationships·11 / 18క్లిప్ 11 / 18
Birth of Jesus
Luke makes his introduction as the careful author of this Gospel. The angel Gabriel appears to Mary, a virgin in Nazareth. He announces to her that she has found favor with God and will give birth to Jesus, the Son of God. Through Jesus' birth, prophecies are fulfilled by the arrangement of events. God leaves no detail unnoticed. The same can be said of our own lives.
ప్రశ్నలుసంబంధిత ప్రశ్నలు
మీది అడగండిబైబిల్ ఉద్ధరణలు
పంచుకోండిLuke 1:1
Many have undertaken to compose an account of the things that have been fulfilled among us,
Berean Standard Bible
Public Domain
మరింత చదవండి...ట్రాన్స్‌క్రిప్ట్
Telugu (తెలుగు)
ఘనతవహించిన థెయొఫిలా, మనందరి మధ్యన నెరవేరిన సమస్తమును గూర్చిన
నిశ్చయమైన సత్యమును నీవు తెలిసికొనుటకు వాటినిగూర్చి వరుసక్రమముగా నీ కొరకు రచించితిని.
కైసరు ఔగుస్తు రోమా సామ్రాజ్యమునకు, చక్రవర్తిగా ఉండి,
హేరోదు యూదయకు రాజుగా ఉన్నప్పుడు గబ్రియేలను దేవదూత గలిలయలోని
నజరేతను ఊరిలో ఒక కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు “మరియ“
భయపడకు మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి.
ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు “యేసు” అని పేరు పెట్టుము.
ఇదెలా సాధ్యం?
నేను కన్యకనే.
పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును;
సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
ఆయన రాజ్యమునకు అంతము ఉండదు.”
మరియ, తన బంధువు ఎలిసబెతును కలుసుకొనడానికి వెళ్లెను, ఆమె వృధ్ధురాలు.
అద్భుతరీతిగా దేవుడు, ఆమె గర్భము ధరించునట్లుగా చేసెను.
ఎలిసబెతు
మరియా, ఓ...మరియా...
స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు
నీకు పుట్టబోవు శిశువును ఆశీర్వదింపబడును.
ఇదిగో, నీ శుభవచనము వినగానే
నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.
నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.
నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించుచున్నది.
ఇది మొదలుకొని అన్నితరములవారు నన్ను ధన్యురాలాందురు.
నజరేతు పుర నివాసులారా ! శ్రద్ధగా వినండి. కైసరు ఔగుస్తు ఆజ్ఞ మేరకు, ప్రజా సంఖ్య వ్రాయుట మొదలయినది.
కావున గలిలయ, యూదయ పట్టణంలోని వారంతా ఆ ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేసుకొనుటకు
వారి వారి జన్మ స్థలములకు వెళ్లవలెను.
యోసేపు, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు
గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేమునకు వెళ్లిరి .
అక్కడ సత్రంలో వారికి స్థలము దొరకనందున ఒక చిన్న పశువుల పాకలో తలదాచుకున్నారు
ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ
తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను;
ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.
“దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.”
ఆ గొఱ్ఱెల కాపరులు త్వరగా వెళ్లి, మరియను, యోసేపును మరియు తొట్టెలోవున్న శిశువును చూచిరి.
వారు రక్షకుడైన యేసు జననమును గూర్చి ప్రకటించిరి.