1 / 3Classic · 3 అధ్యాయాలు

This film is a perfect introduction to Jesus through the Gospel of Luke. Jesus constantly surprises and confounds people, from His miraculous birth to His rise from the grave. Follow His life through excerpts from the Book of Luke, all the miracles, the teachings, and the passion. God creates everything and loves mankind. But mankind disobeys God. God and mankind are separated, but God loves mankind so much, He arranges redemption for mankind. He sends his Son Jesus to be a perfect sacrifice to make amends for us. Before Jesus arrives, God prepares mankind. Prophets speak of the birth, the life, and the death of Jesus. Jesus attracts attention. He teaches in parables no one really understands, gives sight to the blind, and helps those who no one sees as worth helping. He scares the Jewish leaders, they see him as a threat. So they arrange, through Judas the traitor and their Roman oppressors, for the crucifixion of Jesus. They think the matter is settled. But the women who serve Jesus discover an empty tomb. The disciples panic. When Jesus appears, they doubt He's real. But it's what He proclaimed all along: He is their perfect sacrifice, their Savior, victor over death. He ascends to heaven, telling His followers to tell others about Him and His teachings.

మీది అడగండి

బైబిల్ ఉద్ధరణలు

పంచుకోండి
ఉచిత వనరులు

బైబిల్‌ను మరింత లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారా?

మా బైబిల్ అధ్యయనంలో చేరండి

ట్రాన్స్‌క్రిప్ట్

Telugu (తెలుగు)
ఆదియందు దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు. ఆకాశమును, భూమి యందున్న సమస్తమును చేశాడు, దేవుడు చేసిన దానిని చూస్తే అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. దేవుడు చేసిందంతా ఎంతో బాగుంది, ఆయన సృష్టి, ఆయన గొప్పతనమును, మంచితనమును, ఆయన శక్తిని తెలుపుచున్నది. దేవుడు సమస్త జంతువులను, ప్రతి వృక్షమును భూమి మీద మొలిపించాడు. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా, నరుడు జీవాత్మ ఆయెను. మొదటి మానవుడు "ఆదాము" అని పిలువబడ్డాడు. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఆదాము కొరకు సాటియైన సహాయముగా ఒక స్త్రీని దేవుడు సృష్టించాడు. ఆమె "హవ్వ" అని పిలువబడింది. వారు తనతో నిత్యము సన్నిహితంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. రమ్యమైన ఏదెను తోటలో, దేవుని సన్నిధిలో వేదన మరియు మరణం లేకుండా వారు సంతోషంగా జీవించారు. ఈ తోటల నున్నఒక్క ఫలమును తప్ప ప్రతిఫలమును నీవు తినవచ్చు, వద్దన్న ఫలమును తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఆదాముతో చెప్పాడు అయితే సాతాను హవ్వను శోధించాడు అయితే సాతాను హవ్వను శోధించాడు ఆమె దేవుడు తినవద్దన్న పండు తిని, భర్తకు కూడా ఇచ్చింది. దేవుడు వద్దన్న పని చేయుట వలన దేవునితో వారి సంబంధం తెగిపోయింది. దేవుడు పరిశుద్దుడు, కావున పాపులు ఆయన సన్నిధిలో నిలువలేరు. కాబట్టి దేవుడు ఆదాము, హవ్వలను ఏదెను తోటలోనుండి పంపివేశాడు. వారు దేవుని మాటకు అవిధేయులు అయినందున ఈ బాధను అనుభవించిరి. వారు (ఆదాము, హవ్వలు) పాపం చేసినందున మానవులందరూ... భాదకు, మరణమునకు, దేవుని నుండి ఎడబాటుకు గురయ్యారు. కానీ దేవుడు మానవాళిని ప్రేమిస్తున్నందున వారు తనతో నిత్యము జీవించుటకు ఒక మార్గమును ముందుగానే సిద్దపరచాడు. శిక్షకు అర్హులైన మానవాళిని కాపాడి నిత్యము తనతో సహవాసము చేయగల ప్రణాళికను లేఖనముల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఈ ప్రణాళికలో కొంత, తన ప్రవక్తయైన  అబ్రాహామునకు దేవుడు బయలుపరచాడు. అబ్రాహాము దేవున్ని నమ్మి, ఆయనను మహిమపర్చెను. దేవుడు అతనిని ఆశీర్వదించి, అతని ద్వారా సమస్త జనులను ఆశీర్వదిస్తానాని వాగ్ధానము చేశాడు. నిన్ను ఆశీర్వదించి, నిశ్చయముగా నీ సంతానమును సముద్రతీరమందలి ఇసుకవలె విస్తరింపచేసి మరియు ఆకాశ నక్షత్రముల వలె చేసేదనని దేవుడు వాగ్దానము చేశాడు. అబ్రాహాము దేవున్ని నమ్మెను. అతని నమ్మకాన్ని బట్టి అబ్రాహాము నీతిమంతుడని దేవుడు ప్రకటించాడు . ప్రజలు ఆయనను "దేవుని స్నేహితుడు" అని పిలిచారు. ఒక రోజు దేవుడు, అబ్రాహాము తన ఆజ్ఞకు లోబడునో లేదోనని పరిశోధించాడు. తన కుమారుని బలి అర్పించమని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. అబ్రాహాము తన సంతతిని ఈ కుమారుని ద్వారానే విస్తరింపజేసెదనని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగియుండి, దేవుని నమ్మి ఆయనకు విధేయత చూపించాడు. అతడు తన కుమారుని దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని కనబడుచున్నది అని దేవుడు అన్నాడు. అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా దహనబలి అర్పించెను. కృపాకనికరములు గల దేవుడు అబ్రాహాము కుమారుని స్థానంలో బలిగా అర్పించుటకు ఒక పొట్టెలును ఇచ్చినపుడే, మానవాళిపట్ల తనకున్న గొప్ప ప్రేమను చూపించాడు. మానవులందరి కొరకు తాను చేయబోయే అంతిమ బలియాగమును గురించి కూడ ఆయన బయలుపరిచాడు. ఆదాము సంతతిని వారి యొక్క పాపశాపముల నుండి విడుదల చేయుటకు పాపము లేని వ్యక్తిని వారి స్థానములో మరణించుటకు పంపిస్తానని చాలా కాలం క్రితమే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసాడు. ఆయనను నమ్మిన వారికి ఈ బలియాగము ద్వారా దేవునితో నిత్య సహావాసం చేయుటకు మార్గము తెరువబడును. ప్రవక్తలు ఆయనను మెస్సయ్య అని పిలిచారు. ప్రజల పాపముల నుండి విడిపించుటకు, వారిని దేవుని నామమున, నిత్యము పాలించుటకు, మెస్సయ్యను దేవుడు పంపిస్తాడని, ప్రవక్తలు ప్రవచించారు. కొన్ని వందల సంవత్సరముల క్రితమే మెస్సయ్యా చేయబోయే కార్యములను మరియు పొందబొయే శ్రమలను గూర్చి ప్రవక్తలు తెలియజేసారు. మెస్సయ్యతో “నీవు నా కుమారుడవు” అని దేవుడు చెప్పునని ప్రవక్తలలో ఒకరు చెప్పారు. దాని అర్థం శరీర సంబంధమైన కుమారుడు అని కాదు. “దేవుని కుమారుడు” అనే నామము, మెస్సయ్యకు - దేవునితో గల సంబంధాన్ని, లోక రక్షకునిగా, ప్రభువుగా, ఆయన పాత్రను వివరిస్తుంది. ప్రవక్తయైన యెషయా, “కన్యక గర్భవతియై కుమారుని కనును” అని ప్రవచించెను. , ఈయన కన్యక గర్భమందు మానుష్యకుమారునిగా జన్మించి, దేవునిని లోకమునకు వెల్లడిపర్చడానికి పంపబడిన నిత్యమైన దేవుని వాక్యమైయున్నాడు. మెస్సయ్య బెత్లేహెములో జన్మించునని ప్రవక్తలు ప్రవచించిరి. ఆయన వారి రాజుగా యెరూషలేములో ప్రవేశించునని........మరియు 30 వెండి నాణెములకు తన శిష్యునిచేత అమ్మబడునని వారు ముందే తెలియజేసారు. మెస్సయ్య తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడని, మూడవ దినమున మృతులలోనుండి దేవుడు ఆయనను లేపునని ప్రవక్తలు చెప్పారు . ప్రవక్తలు మెస్సయను "మనుష్యకుమారుడు" అని పిలిచారు. మరియు ఆయన మేఘరోహణుడై పరమునకేగుననియు, దేవుడు సదాకాలము సమస్త జనుల మీద ఆయనకు అధికారమిచ్చునని ప్రవచించిరి. 2000 సంవత్సరాల మునుపు యేసు అనే పేరుగల వ్యక్తి ఈ లోకములో నివసించెను. ఆయన చేసిన కార్యములను చూచిన ప్రజలు, "మెస్సయా ఈయనేనా?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసు యొక్క జీవితం, మెస్సయ్యను గురించిన ప్రవచనాలను నేరవేర్చినదా? లేఖనాల్లో వ్రాయబడినట్లుగా, యేసు ఎవరు, ఆయన చెప్పిన మరియు చేసిన అనేక క్రియలలో కొన్నింటిని, ఈ చలనచిత్రం ద్వారా చూపించడమైనది. ఈ చిత్రంలో ఒక వ్యక్తి యేసు పాత్రను పోషించాడు. దీన్ని చేయటానికి యోగ్యుడైన వారు ఎవ్వరూ లేరు, కాని, ప్రజలు యేసు జీవితం గురించి తెలుసుకుంటారని, దేవుడు వాగ్దానం చేసిన రక్షణను పొందుతారని, ఈ చలనచిత్రం నిర్మించడం జరిగింది. ఘనతవహించిన థెయొఫిలా, మనందరి మధ్యన నెరవేరిన సమస్తమును గూర్చిన నిశ్చయమైన సత్యమును నీవు తెలిసికొనుటకు వాటినిగూర్చి వరుసక్రమముగా నీ కొరకు రచించితిని. కైసరు ఔగుస్తు రోమా సామ్రాజ్యమునకు, చక్రవర్తిగా ఉండి, హేరోదు యూదయకు రాజుగా ఉన్నప్పుడు గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో ఒక కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు “మరియ“ భయపడకు మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు “యేసు” అని పేరు పెట్టుము. ఇదెలా సాధ్యం? నేను కన్యకనే. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యమునకు అంతము ఉండదు.” మరియ, తన బంధువు ఎలిసబెతును కలుసుకొనడానికి వెళ్లెను, ఆమె వృధ్ధురాలు. అద్భుతరీతిగా దేవుడు, ఆమె గర్భము ధరించునట్లుగా చేసెను. ఎలిసబెతు మరియా, ఓ...మరియా... స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీకు పుట్టబోవు శిశువును ఆశీర్వదింపబడును. ఇదిగో, నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించుచున్నది. ఇది మొదలుకొని అన్నితరములవారు నన్ను ధన్యురాలాందురు. నజరేతు పుర నివాసులారా ! శ్రద్ధగా వినండి. కైసరు ఔగుస్తు ఆజ్ఞ మేరకు, ప్రజా సంఖ్య వ్రాయుట మొదలయినది. కావున గలిలయ, యూదయ పట్టణంలోని వారంతా ఆ ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేసుకొనుటకు వారి వారి జన్మ స్థలములకు వెళ్లవలెను. యోసేపు, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేమునకు వెళ్లిరి . అక్కడ సత్రంలో వారికి స్థలము దొరకనందున ఒక చిన్న పశువుల పాకలో తలదాచుకున్నారు ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. “దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు.” ఆ గొఱ్ఱెల కాపరులు త్వరగా వెళ్లి, మరియను, యోసేపును మరియు తొట్టెలోవున్న శిశువును చూచిరి. వారు రక్షకుడైన యేసు జననమును గూర్చి ప్రకటించిరి. ఒక వారం అయిన తరువాత, సున్నతి దినములు ప్రారంభమైనందున, యోసెపు మరియలు బాలుని యోరుషలేమునకు తీసుకొనివెళ్లి, ప్రభువునకు ప్రతిష్టించి అతనికి యేసు అని పేరు పెట్టిరి. అక్కడ నీతిమంతుడును, భక్తిపరుడునైన సుమెయోను అను ఒకడు ఉండెను. క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ ద్వారా అతనికి తెలుపబడెను. నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, నీ రక్షణను నేను కన్నులార చూచితిని. ఈ శిశివును దేవుడు ఎన్నుకొనెను. మీరిద్దరు దీవించబడుదురు గాక అంతట వారు మోషే ధర్మశాస్త్రము చొప్పున సమస్తము జరిగించిన తరువాత నజరేతను తమ ఊరికి తిరిగి వచ్చారు. యేసుకు పండ్రెండేండ్ల వయస్సు వచ్చిన్నప్పుడు యోసేపు, మరియ యేసును యెరూషలేముకు పస్కాపండుగ ఆచరించుటకై తీసుకొనివెళ్లారు. తిరుగు ప్రయాణంలో యేసు తమతోనే ఉన్నాడనుకొనిరి. అయితే యేసు యేరుషలేములోనె ఉండిపోయెను. ఆయనను వెదకుచు యేరుషలేమునకు వచ్చి, మూడవ దినమున వారాయనను దేవాలయములో బోధకులు, పెద్దల మధ్యలో కూర్చుండి, వారిని ప్రశ్నలు అడుగుచు తర్కించుండగా చూచిరి. ఇలాంటి ప్రశ్నలు అడుగుచున్న ఈ బాలుడు ఎవరి కుమారుడు? ఇతను నజరేతువాడు అతను మాతోనె ఉన్నాడునుకొన్నాము. బాలుని అత్యుత్సహామును మన్నించండి. విన్నవారందరు బాలుని జ్ఞానమునకు ఆశ్యర్యపడిరి. మమ్ము ఎందుకీలాగు చేసితివి? నీ తండ్రియు నేనును నీవు కనిపించనందున ఎంతో భాదతో వెదకుచుంటిమి. మీరెందుకు నన్ను వెదకుచున్నారు? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీకు తెలియదా? యేసు వారితో కూడ నజరేతునకు వచ్చెను. ఆయన జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లెను. తిబెరియ చక్రవర్తి పాలనలో పదిహేనవ సంవత్సరములో యూదయకు పొంతిపిలాతు అధికారిగా ఉన్నప్పుడు గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, అన్న, కయప ప్రధాన యాజకులుగాను ఉన్నపుడు ఎలీసబెతు కుమారుడైన యోహానుకు దేవుని వాక్యము బయలుపరచబడగా, యోర్దాను నది ప్రదేశాలలో సంచరించుచూ, పాపక్షమాపణ కై మారుమనస్సు సంబంధమైన బాప్తిస్మమును పొందమని ప్రకటించుచుండెను. మీ పాపాలను విడిచి బాప్తిస్మం పొందండి. దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు! ప్రవచనం ద్వారా ప్రవక్త అయిన యెషయా ప్రవచనం పలికినట్లుగా అరణ్యములో ఒకడు కేకలు వేయుచున్నాడు. ప్రభువు కొరకు మార్గము సిద్ధం చేయుడి. ఆయన రాకకు త్రోవను సరాళం చేయుడి. ప్రతి లోయ పూడ్చబడాలి. ప్రతి కొండా.. మెట్టా.. చదును చేయబడాలి. వంకర మార్గములన్నియు సరిగా చేయబడాలి. కరకు మార్గములన్నియు నున్నగా చేయబడాలి. అప్పుడు ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు మేము ఏం చేయాలి? అవును, మేము ఏం చేయాలి మాతో చెప్పండి. ఓ... సర్పసంతానమా, మమ్మల్ని ఏమి చేయమంటారు ? మేము నడువవల్సిన మార్గం మాతో చెప్పండి. మీలో ...ఎవరికైన రెండు అంగీలుంటే! ఏమియు లేనివానికి తప్పకుండా ఇవ్వాలి. ఆహారమున్నవాడు తప్పక పంచుకోవాలి బోధకుడా, మేము పన్ను వసూళ్లు చేయువారము మరి మేము ఏమి చేయాలి? నియమించిన దానికంటె ఎక్కువ తీసుకోవద్దు మరి మా సంగతి ఏంటి? మేమేమి చెయ్యాలి? ఎవని వద్ద బలవంతముగా డబ్బులు తీసుకోవద్దు. ఎవని మీదను అపనింద మోపవద్దు మీ జీతంతోనే తృప్తిపొందండి. ఇలా చూడు...నీవు క్రీస్తువా? నేను బాప్తిస్మము నీళ్లలో ఇచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తి మంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మతోను, అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును; ఆయన చేట ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురమువలె యేసు మీదకు దిగివచ్చెను. అప్పుడు ఒక శబ్ధము ఆకాశము నుండి ఇలా పలికెను. నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను. సేవ అరంభించినప్పుడు యేసు వయస్సు ముప్పది సంవత్పరములు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాదిచేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. అప్పుడు అపవాది ఆయనతో ఇలా అన్నాడు. నీవు దేవుని కుమారుడవైతే, ఈ రాయిని రొట్టె అగుమని చెప్పుము. వ్రాయబడినదేమనగా మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు గాని దేవుని యొక్క మాట వలన జీవించగలడు. అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపిస్తూ ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకప్పగింపబడియున్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగును. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయననే సేవించాలని రాసుంది. మరల సాతాను ఆయనను యెరూషలేమునకు తీసికెళ్ళి, దేవాలయ శిఖరమున నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడనుండి క్రిందికి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెప్పుతుందిగా... పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తిపట్టుకుంటారట? లేఖనం చెప్తుంది నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. బాగున్నావా ? బాగున్నాను. యేసు తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్లెను. వారాయనను ప్రవక్త అయిన యెషయా గ్రంధము నుండి ఒక భాగము చదువుటకై పిలిచిరి. “ప్రభువు ఆత్మ" నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపుకలుగుటకును, నలిగినవారిని విడిపించుటకును తన ప్రజలను రక్షించు సమయం ఆసన్నమైందని ప్రకటించుటకు ప్రభువు నన్ను పంపెను” ఆయన బాగా మాట్లాడుచున్నాడు. నేడు ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినది. లేఖనం నెరవేరిందా? మెస్సయ్య ఒక్కడు మాత్రమే ఈ లేఖనాన్ని నెరవేర్చగలడు. మాకెలా తెలుస్తుంది? తప్పక ఈ సామెత మీరు వాడుతారు, “వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకో.’’ ఇలా కూడా మీరంటారు, “కపెర్నహూములో చేసినారని, విన్న కార్యములను మా మధ్య కూడా చేయండి’’, ఏ ప్రవక్తయు తన స్వదేశ మందు హితుడు కాడని మీతో చెప్పుచున్నాను. ఈ మాటల ద్వారా యేసు వారిని రక్షించుటకు దేవునిచే అభిషేకించబడి పంపబడిన "మెస్సయ" ను అని తాను చెప్పుకోవడం యూదులకు నచ్చలేదు . మెస్సయ గా ఆయనను వారు అంగీకరించలేదు. ఆయనను కొండపై నుండి పడద్రోయలని చూశారు. ఆయన వారి మధ్యనుండి తన మార్గమున వెళ్లిపోయెను. అక్కడ నుండి గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చెను. రోమా ప్రభుత్వ నిరంకుశ పాలనక్రింద ప్రజలు బాధపడుతూ, అట్టి నిరంకుశ పాలన నుండి విడిపించే మెస్సయ్య కొరకు వారు ఎదురుచూస్తున్నారు. శాంతి కలుగును గాక మీకును ప్రభువా. పడవలో ఎక్కించుకుంటావా సీమోను? తప్పకుండా. అతను వెళ్లిపోతున్నాడా ఏంటి..! మాతో మాట్లాడండి మాతో మాట్లాడండి యేసూ, మాతో మాట్లాడండి ఒసారి ప్రార్థన చేయుటకై యిద్దరు దేవాలయమునకు వెళ్లారు. ఒకడు పరిసయ్యుడు, మరియొకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి ఈలాగు ప్రార్థించాడు. “నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను." “వారమునకు రెండు మారులు ఉపవాసము చేస్తూ సంపాదనంతటిలో పదో వంతు చెల్లించుచున్నాను.” అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు “దేవా, పాపినైన నన్ను కరుణించుమనెను.” పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. దోనెను లోతునకు తీసుకెళ్ళండి. చేపలు పట్టుటకు మీరందరు వలలు వేయండి. ఓ భోధకుడా, రాత్రంతయు ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున మేము ఇప్పుడు వలలు వేస్తాము అరె యాకోబు యోహాను యాకోబు, యోహాను, మీ దోనెలు తీసుకొని రండి మాకు సహాయం చేద్దురు. విస్తారమైన చేపలు పడ్డాయ్, మేము వలలు లాగలేకపోతున్నాము. నన్నువిడిచిపెట్టిపో ప్రభూ నేను పాపాత్ముడను భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవైయుందువు నా యొద్దకు రండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. వినినయెడల మీరు బ్రతుకుదురు. ప్రభువు మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు ప్రభువు వైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును. మీరు సంతోషముగా బయలువెళ్లుదురు సమాధానము పొంది తోడుకొనిపోబడుదురు. ఆయన వస్తున్నాడు,వచ్చాడు చూడండి! యేసూ, యేసూ! నాకున్న ఒక్కతే కుమార్తెను కనికరించు! ఆమెకు పన్నెండేళ్లె, చావసిద్ధముగానున్నది, దయచేసి నాతో కూడా రండి ప్రభూ, యయీరూ, అయిపోయిందయ్యా. యేసు.... నీ కుమార్తె చనిపోయింది, బోధకుని ఇక విసికించవద్దు భయపడవద్దు, నమ్ము, ఆమె బాగుపడుతుంది. ఏడవవద్దు, ఆమె చనిపోలేదు; నిద్రించుచున్నది. బిడ్డా, లేమ్మా తినడానికి ఆమెకేమైనా ఇవ్వండి. చెప్పేది వినండి, జరిగినది ఎవ్వరితో చెప్పకండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి వెళుతూ సుంకపు మెట్టునొద్ద పన్నులు వసూలు చేయుటకు కూర్చుండియున్న లేవియుడైన మత్తయిని చూచెను. నన్ను వెంబడించు. యేసు ప్రార్థించుటకు కొండకువెళ్లి, రాత్రంతయు దేవుని ప్రార్థించుటయందు గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అని పేరు పెట్టెను. సీమోను. ఇతనికే యేసు, పేతురు అని పేరు పెట్టాడు. అతని సహోదరుడైన అంద్రేయ యాకోబు యోహాను ఫిలిప్పు బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే! అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, మరియు ఆయనను అప్పగించిన ద్రోహియగు ఇస్కరియోతు యూదా బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు అకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్యకుమారుని నిమిత్తము మను ష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని పలికినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. పదిహేడు, పద్ధెనిమిది , పంతొంమ్మిది, ఇరవై ... ఇంతే నా దగ్గర ఉన్నాయి ఇంతే....... అంటే అర్ధం ఏంటి? ఇవ్వు. అయ్యో, ధనవంతులారా, మీకు శ్రమ మీరు కోరిన సుఖము పొందియున్నారు. ఈయనకి ధనవంతుడు కావాలని లేదు, పిచ్చివాడిలా ఉన్నాడు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా,. మీరు దుఃఖించి యేడ్తురు మనుష్యులు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారి కొరకు ప్రార్థనచేయుడి. ఎవడైన ఒక చెంప మీద కొడితే రెండవ చెంపకూడ చూపండి. మీ పై వస్త్రం ఎవరైన తీసుకొంటె మీ అంగీని కూడ ఇవ్వండి. నిన్నడిగే ప్రతివానికి ఇవ్వండి. మీకున్నది ఎవరన్న తీసుకుంటే దాన్ని మరల అడగవద్దు. ఇతరులు మీకేలాగు చేయలాని మీరు కోరుదురో ఆలాగే మీరు వారికి చేయుడి. మిమ్మును ప్రేమించువారిని మాత్రమే మీరు ప్రేమించినయెడల మీరు ఎందుకు ఆశ్వీర్వదించబడాలి? పాపులు కూడా తమ్మును ప్రేమించె వారినే ప్రేమిస్తారు. మీకు మేలు చేసిన వారికే మీరు మేలు చేసినయెడల మీరు ఎందుకు ఆశ్వీర్వదించబడాలి? పాపులు కూడా అలాగే చేస్తారు. ఆమెను ఎలా తాకగలడు? ఆమెతో ఎలా మాట్లడుచున్నాడు? చీ ........అసహ్యం అలాకాదు మీరు శత్రువులను ప్రేమించుడి, వారికి మేలుచేయుడి, అఫ్పు ఇచ్చి తిరిగి పొందుటకు ఆశించకండి. అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులనబడుదురు. ఆయన, కృతజ్ఞతలేని వారికిని దుష్టులకు ఉపకారియై యున్నాడు. మీ తండ్రి కనికరముగలవాడు, గనుక మీరును కనికరముగలవారై యుండుడి. యేసు, మమ్ములను రక్షించుము . తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి. మీరును క్షమింపబడుదురు; నీ మార్గంలో మమ్ములను నడిపించు ప్రభూ ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; మీరు ఇచ్చె కొలత చొప్పున మీకు ఇవ్వబడుతుంది. గ్రుడ్డివాడు, గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే తప్పక వారిద్దరును గుంటలో పడుదురు గదా. నీవు నీ కంటిలో ఉన్న దూలము చూడక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల మాకు దారి చూపించు ప్రభూ. నీవు మాకు కావాలి, ప్రభూ నిన్ను కని, పెంచిన తల్లి ఎంత భాగ్యవంతురాలు ! దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ఎంతో ధన్యులు. ఇతను ఎవరో అని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఈయనే మెస్సయ్యా అని నీవు అనుకుంటున్నావా? ఈ పరిసయ్యుడు తనతో కూడ భోజనము చేయమని యేసును అడిగెను. ఆయన అతని యింటికి వెళ్లి, భోజనపంక్తిని కూర్చుండగా పిల్లలు............ మీరు వెళ్ళండి నా మాట వినండి వెళ్ళండి పిల్లలు మంచి వారె, కానీ పిల్లలు ఇక్కడ ఉంటె ఎదో ఒక అల్లరి పని చేస్తుంటారు . ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? నాకు తెలియదు ఏం చేస్తుంది ఈమె? ఈయన నిజంగా ప్రవక్త అయితే తనని ముట్టుకొనిన యీ స్త్రీ ఎవరో ఆయనకు తెలియదా! ఈమె ఎంతటి పాపాత్మురాలో ఆయనకు తెలిసి ఉండాలే... ఈ స్త్రీ ఎటువంటిదో నాకు తెలుసు సీమోనూ, నీకోక సంగతి చెప్పాలి. ఒకానొకప్పుడు ఒక ధనవంతునికి ఇద్దరు ఋణస్థులుండిరి. ఒకడు ఐదువందలు మరియొకడు యాబై వెండి నాణెలు చెల్లించాలి వారిద్దరు చెల్లించలేని స్థితిలో ఉండగా అతడు వారిద్దరిని క్షమించాడు. వీరిద్దరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమిస్తాడో చెప్పు? అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు అనిపిస్తుంది. నీవు సరిగానే చెప్పావు. ఈ స్త్రీని చూడు? నేను నీ యింటిలోనికి వచ్చినప్పుడు నీవు నా పాదములకు నీళ్లియ్య లేదు గాని, యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దుపెట్టుకొని ఆహ్వానించలేదు, నేను వచ్చినప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టు కొనుట మాన లేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసి అభిషేకించింది నీకోక మాట చెప్పాలి ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి గనుక ఆమె విస్తారముగా ప్రేమించెను ఎవరు కొంచెముగా క్షమింపబడుదురో వారు కొంచెముగా ప్రేమించబడుదురు నీ పాపములు క్షమింపబడ్డాయి. ఏంటి? నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానముతో వెళ్లుము. పాపములు క్షమించుటకు ఈయనెవరు! యేసు దేవుని రాజ్యసువార్తను ప్రకటించుచు, సంచారము చేయుచుండగా పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలు పోగొట్టబడిన కొందరు స్త్రీలు ఆయనతో వెళ్ళిరి. మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో ఉండిరి గలిలయ అధిపతియైన హేరోదు, తన సోదరుని భార్య హేరోదియతో అక్రమ సంబంధము విషయములో బాప్తిస్మము ఇచ్చు యోహాను గద్దించినందున, అతడు యోహానును చెరసాలలో వేయించెను. అయితే నాయీనను ఊరి పొలిమేరకు మేము వచ్చిన్నపుడు చనిపోయిన ఒకడు మోసికొని పోబడుచుండెను; వాడు విధవరాలైన తల్లికి ఒక్కడే కుమారుడు ప్రభువు ఆమెను చూచి కనికరపడి-ఏడ్వవద్దని చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టి “చిన్నవాడా, లే అని యేసు చెప్పగానే“ ఆ చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. యేసు వానిని అతని తల్లికి అప్పగించెను. అతనిని అడగండి యోహాను చెప్పినట్లు రాబోవు వాడవు, నీవేనా లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా? బోధకుడా! ప్రభువా! బాప్తిస్మం ఇచ్చు యోహాను మమ్మల్ని పంపించాడు. రాబోవు వాడవు, నీవేనా లేక మరొకని కొరకు ఎదురు చూడాలా అని అడగమన్నాడు మీరు వెళ్లి, చూసింది, విన్నది యోహానుకు చెప్పండి. గ్రుడ్డివారు చూస్తున్నారు. కుంటివారు నడుస్తున్నారు. నా విషయమై అభ్యంతరపడని వారు ధన్యులు నన్ను ఎత్తుకోండి నా బుజాల మీదికి ఎక్కు కనిపిస్తుంది. నేను ఇప్సడు యేసును చూడగలను. విత్తనాలు విత్తడానికి రైతు బయలుదేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను. ఆకాశపక్షులు వాటిని తినివేసెను. మరి కొన్ని రాతినేలను పడి మొలకెత్తాయి అయితే తగినంత నీరులేనందున వెంటనే ఎండిపోయాయి. మరి కొన్ని విత్తనాలు ముండ్లపొదల నడుమ పడ్డాయి; ముండ్లపొదలు వాటితో పెరిగి వాటిని అణచివేసెను. మరికొన్ని విత్తనములు మంచినేలను పడ్డాయి; అ విత్తనములు మొలిచి, పెరిగి నూరంతలుగా ఫలించెను. బోధకుడా, ఎందుకు ప్రజల మధ్య ఉన్నప్పుడు ఉపమానలాతో బోధిస్తావు? దేవుని రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులకైతే ఉపమాన రీతిలోనే చెప్పాలి వారు చూస్తున్నారు కానీ వారికీ కనబడదు మరియు వింటున్నారు కానీ అర్ధం చేసుకోరు ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఎవరనగా, వారు వాక్యము విందురు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొనిపోవును. రాతి నేలను పడిన విత్తనముల పోలిక ఎవరంటే, వాక్యమును సంతోషంతో అంగీకరించుదురు. కానీ వారికి వేరు లేదు గనుక కొంత కాలము మాత్రమే నమ్ముతారు. శోదన కాలము వచ్చినప్పుడు వారు పడిపోతారు. ముండ్ల పొద లలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, వారు వింటారు, కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబడుదురు. గనుకా ఫలింపరు. మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారెవరనగా యోగ్య మైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలియించువారు. దీపమును వెలిగించి ఎవ్వడును పాత్రతో కప్పివేయడు లేదా మంచము క్రింద పెట్టడు లోపలికి వచ్చువారికి వెలుగు కనపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును. బయలుపరచబడని రహస్యమేదియు లేదు; దాచబడిన ప్రతిదియు వెలుగులోనికి తీసుకరాబడును గనుక మీరేలాగు వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అయితే లేనివాని యొద్దనుండి తనకు కలదని అనుకొనునది కూడ తీసివేయబడును. బోధకుడా, నీ తల్లియు నీ సహోదరులును వెలుపల నిలిచి, నిన్ను చూడాలనుకుంటున్నారు. వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు, కాగలరు. ఒక రోజు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పి, ప్రయాణమైవెళ్లుచుండగా, యేసు పడవలో గాఢంగా నిద్రించాడు. ప్రభువా! ప్రభువా! యేసూ! మేము నశించిపోవుచున్నాము! అలలు మమ్మును ముంచి వేస్తున్నాయి, మునిగిపోతున్నాము. మమ్మలని రక్షించు ప్రభువా! మనం బ్రతికిపోయాం! మీ విశ్వాసమెక్కడ? వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చారు. యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని ? దయచేసి నన్ను భాదపరచకు! నీ పేరెంటి? సేన ప్రభువా, దయచేసి మమ్ములను పాతాళానికి పంపవద్దు అదిగో ఆ పందుల మందలోనికి మమ్మును పంపుము. ఏయ్! వెనుకకు రండి ఆగండి! ఆగండి! అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచి అక్కడ ఉన్న పందులలో చొరబడ్డాయి. ఇక్కడ నుండి వెళ్ళిపో ఓ మాంత్రికుడా! మమ్మును వదిలి పో ఈ ప్రాతం వదిలిపో మమ్మును వదిలి పో ఇక్కడ నుండి వెళ్ళిపో మీరు ఎక్కడికి వెళ్ళిన మీతోనే వస్తాను నన్ను మీతో రానివ్వండి. నీ ఇంటికెళ్ళి దేవుడు నీకు చేసిన మేలును గూర్చి చెప్పుము యేసు తన శిష్యులతో కలసి బేత్సయిదాకు ఏకాంతముగా వెళ్ళెను జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడించిరి. పొద్దు గ్రుంకే సమయమున పేతురు ఏసుతో ఇలా అనెను ప్రభువా! ఈ జనమును పంపివేయుము, వారి చుట్టూ పక్కన గ్రామాలకు వెళ్లి బస ఆహారమును చూసుకుంటారు. ఇక్కడ వారికి తినుటకి ఏమీయు లేదు. మీరే వారికి భోజనము పెట్టండి కానీ మా దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి . దేవా మా ప్రభువా, సర్వాధికారి భూమి నుండి ఆహారాన్ని ఇచ్చే దేవా, నీకే స్తుతులు. ఇది ఒక అద్బుతం. నమ్మలేకపోతున్నాము! ప్రజలు నా గురించి ఏమనుకొంటున్నారు? కొందరు నీవు బాప్తిస్మమిచ్చు యోహాననియు ఇంకొందరు ఏలీయా అనియు, మరికొందరు పూర్వకాలపు ప్రవక్తలలొ ఒకడు తిరిగి లేచెనని చెప్పు కొనుచున్నారు. మీ సంగతేంటి? నేనెవరినని అనుకుంటున్నారు? నీవు దేవుని మెస్సయ్యావు. ఇది ఎవనితోను చెప్పవద్దు. మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, తృణికరించబడి తరువాత చంపబడి, మూడు దినములైన తరువాత జీవమునకు లేపబడాలి. మీరెవరైనా నాతో వస్తారా? నేను వెంబడిస్తాను ప్రభువా, కాని మొదట నేను వెళ్లి నా ఇంటి వారి నుండి సెలవు తీసుకొనివస్తాను. నాగటి మీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడు. ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను తృణీకరించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును. ఒకడు లోకమంతయు సంపాదించుకొని, తన ప్రాణమును పోగొట్టుకొనినయెడల, వానికేమి ప్రయోజనము? ఎవరైతే నా గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడునో మనుష్య కుమారుడు, తనక ను , తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగిన మహిమతో వచ్చునప్పుడు వాని గూర్చి సిగ్గుపడును. ఇక్కడున్న కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. అంతలో, పరలోక మహిమతో ఇద్దరు పురుషులు కనపడీ ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే మరియు ఏలీయా అను వారు నీవు దేవుని చిత్తమును నేరవేర్చదవు నీవు యెరూషలేములో మరణించెదవు వారు ఆయన యొద్ద నుండి వెళ్లిపోవుచుండగా, పేతురు యేసుతో ఇలా అనెను ప్రభువా! మనమిక్కడే ఉండుట మంచిది మేము మూడు పర్ణ శాలలు కట్టెదము అతడీలాగు మాటలాడుచుండగా మేఘ మొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు "ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడి" అని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. బోధకుడా! బోధకుడా, నా కుమారుని కటాక్షించుము! దయచేసి కనికరించండి, నాకున్నది ఒక్కడే కుమారుడు. వానిని పట్టిన దయ్యమును వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారికి చేత కాలేదు. విశ్వాసములేని మూర్ఖతరమా, నేనెంతకాలము మీతో కూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని తీసుకురా. అతని ముఖం కూడా మారిపోయింది! ఎంత అద్బుతం! మాకు ప్రార్థించ నేర్పవా, యోహాను తన శిష్యులకు నేర్పినంచినట్టుగా ఈ విధంగా ప్రార్ధించండి. "పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నేరవేరునట్లు భూమి మీదను నెరవేరును గాక మాకు కావలసిన అనుదినాహారము దయచేయుము; మా యెడల అపరాధము చేసినవారిని మేము క్షమించిన రీతిగా, మా పాపములను క్షమించండి. మమ్మును శోధనలోనికి తేక, దుష్టుని నుండి కాపాడుము." అడుగుడి, మీకివ్వబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే, చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డు నడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చెప్పేది వినండి, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో, అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి ఆహారము కంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు కారా? మరియు మీలో, ఎవడు, చింతిచుటవలన తన ఆయుష్షును పొడిగించుకోగలడా? కాబట్టి అతిచిన్నవిషయమే మీచేత కాకపోతే. తక్కిన వాటిని గూర్చి చింతింపనేల? పువ్వులేలాగు ఏదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు; తన సమస్తవైభవముతో కూడిన సొలొమోను సయితము వీటిలో ఒకదానివలెనైన అలంకరింపబడలేదు. అయితే నేడు పొలములో ఉండి, రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనివ్వడా. మా విశ్వాసము వృద్ధిచేయండి. మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి "నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని" చెప్పునప్పుడు అది మీకు లోబడును. అభ్యంతరములు రాకుండుట అసాధ్యము, కాని అవి ఎవనివలన వచ్చునో వానికి శ్రమ. వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరు గటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? ఈ పోలికగా ఉంది. ఒక మనుష్యుడు తీసికొని పోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశ పక్షులు దాని కొమ్మలయందు నివసించెను. అతను దేని గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. సుంకరులతో మరియు పాపులతో నీవెందుకు తిని త్రాగుచున్నావు? రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు. మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు దేవుని రాజ్యమును గురించి ఇంకేమైన చెప్పండి చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది. మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, చినిగిపోని సంచులలో పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; ఏ దొంగ దానిని దొంగిలించలేడు. చిమ్మెటలు దానిని కొట్టి వేయవు . మీ ధనమెక్కడ ఉంటుందో అక్కడనే మీ హృదయము ఉండును. అమ్మా, నీ వ్యాధి నుండి నీకు విడుదల కలిగింది చూడండి! ఆమె స్వస్థత పొందింది, చూడండి!, ఇది ఒక అద్బుతం చూడండి! వచ్చి చూడండి ! ప్ర ప్ర ప్ర ప్రభువునకే స్తోత్రము పద్దెనిమిదేండ్లు భరించాను! పని చేయుటకు ఆరు దినములు ఉన్నవి కదా, స్వస్థతకొరకు ఆ దినములలోనే రండి సబ్బాతుదినమున రాకూడదు. వేషధారులారా! మీరు, విశ్రాంతిదినమున యెద్దునైనను, గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలు కొనిపోయి, నీళ్లు పెట్టును గదా. ఇదిగో పద్దేనిమిదేండ్ల నుండి సాతాను చేత బంధింపబడిన అబ్రాహాము కుమార్తెయైన ఈమెను విశ్రాంతిదినమందు ఈ కట్ల నుండి విడిపింపకూడదా? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను? సత్పురుషుడనని నన్నెందుకు అంటున్నావు? దేవుడొక్కడే సత్పురుషుడు కదా! దేవుని ఆజ్ఞలను నీవెరుగుదువు "వ్యభిచరింప వద్దు" "నరహత్యచేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు." "నీ తల్లి దండ్రులను సన్మానింపుము." నేను బాల్యము నుండి వీటినన్నిటిని పాటించుచున్నాను. ఇంకను ఒక్కటి నీకు కొదువగా ఉన్నది. నీకు కలిగినదంతయు అమ్మి, దానిని బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడింపుము. కానీ మేము వ్యాపారస్తులము ధనికులము కూడా. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము. కచ్చితంగా చెప్పండి దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది ? దేవుని రాజ్యము అందరికి కనిపించేలా రాదు. కావున ఎవరు,  "చూడుడి, యిక్కడని, అదిగో, అక్కడ అని చెప్ప వీలుపడదు. ఎందుకనగా, దేవుని రాజ్యము మీ మధ్యనేయున్నది. మనుష్య కుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరుకొను దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి మరియొక దిక్కునకేలాగు ప్రకాశించునో ఆలాగున మనుష్యకుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత తృణీకరించబడవలెను. మీరు చూచుచున్నవాటిని చూచు కన్నులు ధన్యములైనవి; అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరిరి గాని చూడలేదు వినగోరిరి గాని వినడానికి అవకాశం దొరకలేదు. మేమేమి చేయాలి? దేవుని వాక్యం ఏమి చెపుతోంది? వాటిని నీవెలా అర్థము చేసుకున్నావు? నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను పూర్ణ వివేకములతోను , పూర్ణ శక్తి తోనూ ప్రేమించి నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించాలి సరిగా చెప్పావు. ఆలాగే చేయుము అప్పుడు నీవు జీవించెదవు. అయితే, నా పొరుగువాడెవ్వడు? ఆ సైనికులైతే కారు. మరి కైసరు సంగతి ఏంటి? ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారతని బట్టలు దోచుకొని, అతనిని కొట్టి కొరప్రాణముతో విడిచిపెట్టిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను. ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన గాడిద మీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి "ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెద" నని అతనితో చెప్పిపోయెను. మరి దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచుచున్నది? అతని మీద జాలి పడినవాడే. నీవును వెళ్లి ఆలాగు చేయుము . ఆ... చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానివ్వండి. దేవుని రాజ్యం ఈ చిన్న పిల్లలను పోలిన వారిదేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ చిన్నబిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడు నా నామమున ఈ చిన్న పిల్లలను చేర్చుకొనువాడు, నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును. మీలో ఎవడు అల్పుడైయుండునో వాడే గొప్పవాడు. ఓయ్...ఈ సందండి ఏంటి? ఏమి జరుగుతోంది? నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్లుచున్నాడు. యేసూ..., యేసూ! దావీదు కుమారుడా, నన్ను కరుణించూ నేను నీకు ఏమి చేయాగోరుచున్నావు? నాకు చూడాలని ఉంది అయితే చూడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నాకు చూపు వచ్చింది ! నాకు కనిపిస్తుంది ! నేను చూడగలుగుతున్నాను దేవునికి స్తోత్రం, యేసు యెరూషలేమునకు వెళ్లుచుండగా గొప్ప జనసముహములు ఆయనను వెంబడించాయి. రక్షణ మార్గమును గూర్చియు దేవుని రాజ్యమును బోధించమని వారు ఆయనను కోరిరి. ఈయన నిజంగా ప్రవక్తే. బోధకుడా నన్ను రక్షించు! ప్రభువా మమ్ముల రక్షించండి! రక్షించండి! దేవునికి స్తోత్రం! సత్య మార్గమును మాకు చూపండి ప్రభూ! యెరికో పట్టణములో సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అను ఒకడు, యేసు ఎవరో చూడగోరి, జనులు గుంపుకూడి ఉన్నందున చెట్టెక్కెను. అదిగో పన్ను వసూలు చేసేవాడు. జక్కయ్యా, త్వరగా దిగు. నేడు నేను నీ ఇంటికి వస్తున్నా. మా ఇంటికా? అతని ఇంటికి ఎవరైనా వెళ్తారా? జక్కయకు యేసు ఎలా తెలుసు? వినండి. నేను నా ఆస్తిలో సగభాగము ఇప్పుడే పేదలకు ఇచ్చేస్తాను నేను ఎవ్వరి యొద్దనైన అన్యాయముగా దేనినైన తీసుకుంటే అతనికి నాలుగంతలు తిరిగి చెల్లిస్తాను. నమ్మలేకపోతున్నాము, పన్నువసూలు చేసేవాడు డబ్బు తిరిగి ఇవ్వడమా! అసాధ్యం! నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే! నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను. వినండి. మనం యెరూషలేం వెళ్తున్నాం, అక్కడ మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనుల కప్పగింపబడును; వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మి వేసి, కొరడాలతో కొట్టి చంపుదురు. అయితే, మూడవ దినమున ఆయన తిరిగి లేచును. మానవుల పాపములకు ప్రాయశ్చితంగా ఆయన మరణిస్తాడని తెలిసి కూడా యెరూషలేమునకు దృఢసంకల్పంతో వెళ్లెను. యేసును చూచిన ప్రజలు సంతోషముతో దేవుని స్తుతించి, ఆయనను రాజుగా ప్రకటించిరి. బోధకుడా, నీ శిష్యులను మౌనముగా ఉండమని చెప్పు. వీరు ఊరకుండినయెడల, రాళ్లు కేకలు వేసి స్తుతించగలవు దేవునికి మహిమ కలుగునుగాక! యేసు యెరూషలేమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై దు:ఖించెను. ఈ నీ దినమందు సమాధాపరమైన సంగతులను తెలిసికొంటె నీకెంతో మేలు; కాని చూడలేకున్నావు. ఒక దినము వచ్చుచున్నది, ఆ దినమున నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నిన్ను నీ పిల్లలను కలగలిపి నాశనం చేస్తారు. నీ దేవుడు నిన్ను దర్శించిన దినమున నీవు ఆయనను గుర్తించనందున నీలో రాయి మీద రాయి నిలువకుండ చేయుదురు. ఆరాధన కేంద్రమైన యెరూషలేము పరిశుద్ధ మందిరమును వ్యాపార కేంద్రంగా మార్చిరి. లేఖన ప్రకారము "నా మందిరము ప్రార్థన మందిరము" అయితే దానిని మీరు దొంగల గుహగా చేసితిరి. ఆయన, నా మంద వైపు వెళ్తున్నాడు! అతనిని ఆపండి! అతనిని ఆపండి! భటులను పిలువండి! భటులను పిలువండి! ప్రజలు యేసును రాజుగా ప్రకటించినందున మత పెద్దలకు మరియు రాజకీయ నాయకులకు యేసు పట్ల వ్యతిరేకత మొదలైంది అనేకులు ఆయనను రాజుగా ప్రకటిస్తున్నారని నాకనిపిస్తోంది. రాజా? అహహ అహహ బిచ్చగాళ్ళకు, వేశ్యలకు దొంగలకా? ఇలాంటి వారిని చాలా చూసాం, వస్తారు, ఏమోమో చెప్పి, పోతారు. ప్రజలు వారిని మర్చిపోతారు. గుడ్డిగా ఆలోచించకు. దినదినానికి అతని ప్రాచుర్యం ఎక్కువ అవుతుంది. ప్రజలు అతన్ని అభిమానిస్తున్నారు. అతనిని రాజుగా ఉహించుకుంటున్నారా. మీకు ఇదే నా హెచ్చరిక. అతనివల్ల శాంతికి భంగం కలిగితే, మీరే దానికి బాధ్యులు. ఇతని మాట నిజమేనెమో. ఈ గలిలయుని నిలదీసే సమయం ఇదే వారు ధర్మశాస్త్రమును బోధించుదురుగాని అనుసరించరు అంటూ, శాస్త్రులు మరియు పరిసయ్యులను యేసు ఖండించడం రోజు రోజుకు ఎక్కువైంది. దేవాలయములో ఒక బీద విధవరాలు కానుకల పెట్టెలో రెండు కాసులు వేయడం యేసు చూశాడు. ఇది చాల తక్కువ. ఇంతకు మించి ఆమె ఇవ్వలేదా? ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ ఇచ్చింది. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి ఇచ్చారు యీమెయితే తన లేమిలో నుండి జీవనమంతయు ఇచ్చింది. యీమెయితే తన లేమిలో నుండి జీవనమంతయు ఇచ్చింది. చెప్పవయ్యా ఇలా మాట్లాడడానికి నీకున్న అధికారమేంటి? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? నేను మిమ్మునొక మాట అడుగుతాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మము దేవుని నుండి కలిగినదా లేక మనుష్యుల నుండి కలిగినదా? ఏం చెప్పుదాం? మనము "దేవునుండి కలిగినదని" చెప్పినయెడల - "ఆలాగైతే మీరెందుకతని నమ్మలేదని ?" ఆయన మనలనడుగును. "మనుష్యుల వలన కలిగినదని" చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు. యోహానును ప్రవక్త అని అందరును నమ్ముచున్నారు. అది ఎక్కడనుండి కలిగిందో మాకు తెలియదు. ఐతే ఏ అధికారముతో నేనీకార్యములు చేయుచున్నానో మీతో చెప్పను. ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిని కౌలుకిచ్చి, ఇల్లు వదిలి దేశాంతరముపోయినాడు. ద్రాక్ష పండ్లు కోయు కాలము వచినప్పుడు యజమాని ఆ కౌలుదారులయొద్దకు ఒకని పంపి పంటలో తన భాగమిమ్మని కబురుపెట్టాడు. కౌలుదారులేమో వానిని కొట్టి వట్టిచేతులతో పంపి వేసిరి. మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కూడా కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి. మరలతడు మూడవవాని పంపగా వారు వానిని కూడా గాయపరచి పంపివేసిరి. అప్పుడా ద్రాక్షతోట యజమానుడు "నేనేమి చేతును? నా స్వంత కుమారుని పంపుదును, వారు తప్పక అతని గౌరవిస్తారను కొన్నాడు." ఐతే కౌలుదారులు కుమారుని చూచి, ఒకరితో ఒకరు ఇలాగు అనుకున్నారు. వీడు మన యజమాని కుమారుడు. మనము వీనిని చంపితే, ఈ ఆస్తి మొత్తం మనదే అవుతుందను కున్నారు. ఇంకా చెప్పండి ప్రభూ! వారతని ద్రాక్షతోట నుండి బయటకు తోసివేసి అతనిని చంపిరి. ఆ తోట యజమాని ఆ కౌలుదారులను ఏం చేస్తాడంటారు? ఆయన వచ్చి వారిని చంపి ద్రాక్షతోటను వేరేవారికి కౌలుకిస్తాడు. మరి రాసి ఉన్న ఈ లేఖన భావం ఏంటి? "ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను." ఆ రాయి మీద పడే ప్రతివాడును ముక్కలైపోతాడు. అలాగే ఈ రాయి ఎవని మీద పడునో అది వానిని నలిపివేయును. బోధకుడా, నీవు చెప్పే మాటలు న్యాయమని మాకు తెలుసు. సత్యము విషయమై నీవు మోహమటము లేక దేవుని మార్గమును బోధించుచున్నావని కూడా మేము ఎరుగుదుము. ఇది చెప్పండి, రోమా చక్రవర్తికి పన్నుచెల్లించడం మన ధర్మశాస్త్రానికి అనుకూలమా, విరుద్ధమా? జాగ్రత్త ప్రభూ అతడు నిన్ను చిక్కులో పెట్టవచ్చు. ఒక వెండి నాణెము ఇవ్వండి. దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవరివి? కైసరువి ఆలాగైతే కైసరువి కైసరునకే ఇవ్వండి ఏవి దేవునివో దేవునికి చెల్లించండి దానికి మీ సమాదానం ఏమిటి? పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల పండుగ సమీపించింది. యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను సిద్ధపరచుడని వారిని పంపెను. నేను శ్రమపడకముందుగా మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని ఆశించుచున్నాను. దేవుని రాజ్యంలో పూర్తి అర్ధంతో పస్కా నెరవేరు వరకు నేను దీనిని మళ్లీ భుజింపనని మీతో చెప్పుచున్నాను. దేవా, మా ప్రభువా! సర్వలోకమునకు రాజా, ద్రాక్షవల్లి నుండి ఫలమిచ్చువాడా,స్తుతులు మీరు దీనిని తీసికొని పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. దేవా, మా ప్రభువా! సర్వలోకమునకు రాజా, భూమి నుండి ఆహారమునిచ్చువాడా, స్తుతులు. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి. ఈ పాత్ర మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. వినండి, నన్ను అప్పగించు వాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది. నిర్ణయము ప్రకారము మనుష్యకుమారుడు పోవు చున్నాడుగాని ఎవరిచేత అప్పగింప బడుచున్నడో వానికి శ్రమ ఎవరిని గూర్చి చెప్పుచున్నాడో ఆయనను అడుగు. అది ఎవడు ప్రభూ? నేను నిన్ను ఎన్నటికి విడువను! మీలో గొప్పవాడు, చిన్నవానివలెను, నాయకుడు, పరిచారకుని వలె ఉండాలి. గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా లేక భోజనము వడ్డించువాడా? భోజనపంక్తిని కూర్చున్నవాడే కదా! నేను మీ మధ్య పరిచర్యచేయు వానివలె ఉన్నాను కదా. నా శోధనలలో నాతో కూడ నిలిచియున్నవారు మీరే; నా తండ్రి నాకు రాజ్యాధికారం ఇచ్చినట్లుగా, అలాగే, నేను మీకు అధికారమును ఇస్తున్నాను. మీరు నా రాజ్యములో నా బల్లయొద్ద అన్న పానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల వారిని ఏలెదరు. అయితే ఇక నిన్ను అప్పగించేదెవరు? సీమోనూ, సీమోనూ అగు, సాతాను మిమ్ములనందరిని శోధించ కోరాడు, గోధుమలను జల్లించి పొట్టును వేరుచేయునట్లుగా, మిమ్ములను జల్లించగోరాడు. కానీ, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నీ కొరకు ప్రార్థించాను. నీవు మనస్సు తిరిగిన తరువాత, నీ సహోదరులను తప్పక బలపర్చు. ప్రభువా, నీతోకూడ జైలుకు వెళ్లడానికి సిద్ధం చావడానికైనా సిద్ధం. పేతురు, చెప్పేది విను, నీవు నన్నెరుగవని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాను. సంచి, జాలె, చెప్పులు లేకుండ పంపినప్పుడు, మీకు ఏమైన తక్కువైందా? లేదు, కాలేదు. ఇప్పుడైతే సంచియు జాలెయు తీసికొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొవలెను; లేఖన ప్రకారముగా, "ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను" అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరబోతుంది. ఇదిగో, ఇక్కడ రెండు కత్తులున్నాయి, ప్రభూ అవి చాలు. యూదా సమాజ పెద్దలు యేసుని ఎలా చంపాలని అని అలోచించుటకు కూడుకొనిరి. పన్నెండు మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించాడు. వాడు, యేసును అప్పగించుటకు ఆ పెద్దలతో కుట్ర చేశాడు. యేసు యెరూషలేమును విడిచి, ప్రార్థన చేయుటకు ఒలీవల కొండకు వెళ్ళాడు. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడి. ఇస్కరియోతు యూదా, ముప్పై వెండి నాణేముల కొరకు, యేసును అప్పగించాడు. మానవుల పాపముల కొరకు తాను మరణించవలసిన సమయం ఆసన్నమైనదని యేసు ఎరిగి ప్రార్ధించాడు. తండ్రీ, నీ చిత్తమైతే యీ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము; అయినను, నా యిష్టము కాదు, నీ చిత్తమే నెరవేర్చుము. అప్పుడు పరలోకము నుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. మరియు ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె నేలారాలెను. మీరెందుకు నిద్రించుచున్నారు? లేవండి, శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడి. యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగిస్తున్నావా? ప్రభువా, కత్తితో నరుకుదుమా? ఇతనిని బంధించండి ఇక చాలు! అద్భుతం! మీరు బందిపోటు మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను వచ్చారు నేను ప్రతిరోజు మీతో దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే? అయితే ఇది మీ గడియ అంధకార సంబంధమైన అధికారం ఏలే గడియ. బంధించండి! జాగ్రత్తగా కాపలా కాయండి. సైనికులు యేసుని ప్రధాన యాజకుని యింటికి తీసుకెళ్లి. యూదుల రాజా అని ఆయనను ఎగతాళి చేశారు. రాజుగారి వస్త్రం ఇదిగో. ఏమి జరుగబోతుందో మాకు చెప్పు. మమ్ములను రక్షిస్తారా మహారాజా, మమ్మలి రక్షిస్తారా ? ఇతను కూడా ఆ యేసుతో ఉన్నవాడే ఆయన నాకస్సలు తెలియదమ్మా. ఇద్దరూ కలిసి ఉండడం చూశాను. నీ దీన దాసులం ఒకరి సహాయం కొరకు చూడడం ఏలాగుంది? వారిలో నీవొకడవి కదా? అయ్యో నేను కాను. అనుమానమే లేదు, ఈయన యేసుతో ఉన్నవాడే, ఎందుకంటే వీడు గలిలయుడు. వెళ్ళిపొండి మీరేంమాట్లుడుతున్నారో నాకు తెలియనే తెలియదు. యేసు పేతురు వైపు తిన్నగా చూసెను. అప్పుడు "పేతురు నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువు" అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొని ఏడ్చెను. ఓ దేవా, నన్ను కనికరించుము నీ శాశ్వత ప్రేమను బట్టి నా దుష్టత్వమును కడిగి, పవిత్రపరచు నీవు కోరునది కేవలము సత్యమే సత్యమే. నా యందు శుద్ధహృదయం కలిగించు దేవా. రక్షణ వలన కలుగు ఆనందమును నాకు మరల కలిగించు, ఇష్టముతో నీకు విధేయత చూపించేలా చేయుము. చూపించులా చేయుము. నన్ను మన్నించు... మన్నించు ప్రభూ... నిన్ను కొట్టిందెవరు? చెప్పు. ఇప్పుడు నిన్ను ఎవరు కొడతారో ప్రవచించు! ఆపండి! నేను ఆపమన్నానా! అతన్ని సభ ముందుకు తీసుకరండి. నడువు! మత నాయకులూ యేసుని ప్రశ్నించుటకు కూడుకొనిరి మాతో చెప్పు, నివేనా మెస్సయ్యావూ ? నేనేమీ చెప్పినా, మీరు నన్ను నమ్మరు. నేను మిమ్మును ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేరు. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడౌతాడు. అలాగైతే, నీవు, దేవుని కుమారుడివా? మీరన్నట్టు నేనే ఆయనను. అలా చెప్పే అదికారము ఈయనకు ఎవరిచ్చారు? ఇతను దెవదూషణ చేశాడు ఇతను దోషి! అతడు చెప్పినది మనము చెవులారా విన్నాము. ఇతన్ని పిలాతు దగ్గరకు తీసుకపోదాం అవును అతన్ని తీసుకెళ్ళండి! పదా! వారందరును లేచి, ఆయనను, రోమా అధికారులలో అతి క్రూరుడైన పొంతి పిలాతు నొద్దకు తీసికెళ్లారు. పిలాతు వేలాదిమందిని బాధతో మరణించేలాగ, తానే సిలువ వేయించినాడు. ఇంత ఉదయాన్నే వచ్చారు, ఎం కావాలి? ఇతడు మా ప్రజలను తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. ఇతను దేవాలయ బజారులో అలజడి సృష్టించాడు. ఇతనికి ఏ శిక్ష విదిస్తారు? శిక్షించండి! ఈయనలో నాకు ఎలాంటి దోషం కనబడలేదు. కైసరునకు పన్నియ్యవద్దని మా జనమును తిరుగబడుటకు ప్రేరేపింస్తూ... తానే మెస్యయ్యనని అంటున్నాడు, రాజునని అంటున్నాడు. రాజా? నీవు యూదులకు రాజువా? నీవన్నట్టే గలిలయలో బోధించటం ప్రారంభించి ఇప్పుడు ఇక్కడకు వచ్చాడు. గలిలయాలోన? ఈ మనుష్యుడు గలిలయుడా? అలాగయితే, హేరోదు అతనిని విచారించనీయండి. ఆయన ఇంకా యేరుషలెంలో నే ఉన్నాడు కదా? హేరోదు దగ్గరకు తీసుకెళ్ళండి! నివేవరివని చెప్పుకుంటున్నావు? శిష్యులని పిలుస్తున్నావే వారు ఎవరు? నీవు అద్బుతాలు చేయాగలవని అనేకులు చెపుతున్నారు. నాకొక అద్బుతం చూపించు. నా ప్రభువా, ఇతను ప్రజలను మోసగిన్స్తున్నాడు. తానె రాజునని చెప్పుకుంటున్నాడు. ఇతడా? రాజా? హాహ్.. హాహ్.. హాహ్.. హా... మహారాజా. ఇతన్ని బాగా కొట్టండి. పిలాతు నొద్దకే తీసుకెళ్ళండి. ఇది ఆయన ప్రాంతము. ఈ మనుష్యుడు, మరణానికి తగినది ఏదియు చేయలేదు. నేను ఇతనిని కొరడాలతో కొట్టించి విడుదల చేస్తాను. ఈ పండుగ సందర్భములో మకొరకు ఒకరిని విడుదల చేసే వాడుక ఉన్నది కదా? మాకు కావలసింది బరబ్బానే. అవును, బరబ్బా ఇతన్ని చంపేయండి అవును బరబ్బానే విడిపించండి. ఇతన్ని సిలువ వేయండి ఇతన్ని సిలువ వేయండి నీవు, నీవు, కొరడాలతో కొట్టండి. దేని కొరకు వేచియున్నావు, పిలాతు? ఆయనే యేసు! అతనిని ఎందుకు అలా హింసిస్తున్నారు? అతనిని విడిచి పెట్టండి, ఆయనే మెస్సయ్య! అతడు ఏ నేరము చేయలేదు ! ఇతనిని పైకి లేపండి ! అతనిని సిలువ వేయమని జనముల ఆరుపులు ఎక్కువ అవుతూనేవున్నాయి. కాబట్టి పిలాతు, యేసు మరణశాసనాన్ని వ్రాసాడు. బరబ్బాను విడుడుదల చేసి, యేసును సిలువ వేయుటకు వారికీ అప్పగించెను. జరుగు, వెనక్కి జరగండి, అందరూ వెనక్కి జరగండి. నువ్వు! వెనక్కి జరుగూ... నువ్వూ, నీ పేరెంటి? కురేనీయుడైన సీమోను అయ్యా ఇలా ముందుకు రా! తాళ్ళు తెంపండి! నీవ్వు దానిని మొయ్యి. పదా నడువు! మేము నీ కొరకు ఏడుస్తున్నాము ప్రభూ, దుఖిస్తున్నాము. నీళ్ళు తాగు తాగు. తాగు ప్రభూ. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. వారు పచ్చి మ్రానుకే యీలాగు చేసినయెడల, ఎండినదానికేమి చేయుదురో? దేవుడు నిన్ను కాపాడును గాక. మేము మీ కోసం ప్రార్దిస్తాము నడువు, ముందుకు ... ముందుకూ... పదా, త్వరగా... త్వరగా, ఇప్పుడు నువ్వు ముందు పదా... సిలువను పైకి లేపండి! నువ్వు కొయ్యమేకు కొట్టు! తాళ్ళు లాగండి! తండ్రీ, వీరేమిచేయుచున్నారో, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. వీడు ఇతరులను రక్షించాడు ఇప్పుడు తనను తాను కాపాడుకోనీ... అవును, నీవు మెస్సీయ్యావైతే నిన్ను నీవు కాపాడుకొ! నీ అద్భుతములలో ఒకటి చూపించు! కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్తల ద్వారా, దేవుడు ప్రవంచించిన విధముగా నేరాస్తులను కుడివైపున ఒకనిని ఎడమ వైపు ఒకనిని యేసుతో కూడా సిలువ వేసిరి ఇది మాములు ప్రవక్త వేసుకొనే వస్త్రం కాదు, హాహ్ ... హాహ్... హాహ్... హా! హేయ్ ...దీనిని చింపొద్దు , నాకు ఇవ్వు ......ఏంచేయ్యాలో నేను చెప్పుతాను. దీని కొరకు చీట్లు వేసుకొందాం. నీవు చాల అదృష్టవంతుడివి, ఈ వస్త్రమును నీవు గెల్చుకున్నావు , దీనితో ఏమి చేస్తావు? ఇతడు "యూదుల రాజు" అని పైవిలాసము ఆయన తలకు పైగా పెట్టిరి నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకో. నీవు మెస్సయ్యవు కదా? నిన్ను నివు రక్షించుకొని మమ్మును కూడాకాపాడు. నీవు దేవునికి భయపడవా? ఈ శిక్ష మనకైతే న్యాయమే. ఈయనైతే, ఏ తప్పిదమును చేయలేదు. నీవు రాజుగా వచ్చినప్పుడు. నన్నుగుర్తుంచుకో, యేసూ. నేడు నీవు నాతో కూడ పరదైసులో నిశ్చయముగా ఉంటావు. అప్పుడు రమారమి మధ్యాహ్నాము. దేశమంతట చీకటి మూడు గంటల పాటు కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భా లయపు తెర నడిమికి చినిగెను -తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. శతాధిపతి జరిగినది చూచి దేవుని మహిమపరచెను. దేవునికి మహిమ కలుగును గాక, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడే యూదుల పట్టణ గౌరవ సభ్యుడైన అరిమతయియ యోసేపు అను ఒకతను ఈ దుష్కార్యమునకు సమ్మతింపలేదు. అతడు, విశ్రాంతి దినము ఆరంభం కాక మునుపే యేసును సమాధిలో ఉంచుటకు పొంతి పిలాతు నుండి అనుమతి పొందెను. మేము సుగంద పరిమళ తైలములను తెచ్చి ప్రభు దేహమును సిద్ధపరుస్తాము. నేనూ సాయపడ్తాను. తొందరగా పదండీ, విశ్రాంతి దినము సమీపిస్తుంది. ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాధి యొద్దకు వచ్చిరి. సమాధిముందర ఉంచిన రాయి దొరలింప బడియుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు; ఆయన గలిలయలో ఉన్నప్పుడు "మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని" మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడి. వినండి! సమాధి ముందర ఉంచిన రాయి దొర్లిపోయింది! మేము లోపలికి వెళ్లితే, అక్కడ ప్రభువైన యేసు దేహము మాకు కనబడలేదు. ఏమిటి ? మన ప్రభువు దేహము మీకు కనబడలేదా? సూర్యుని వలె ప్రకాశిస్తున్న దూతలు, మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెదకుచున్నారు? అని అడిగారు. ఇది నిజం మమ్మల్ని నమ్మండి. నమ్మండి మమ్మల్ని. మేము వారిని చూశాం, మీరు కూడా వెళ్లి చూడండి, సమాది ఖాళీగా ఉంది, మన ప్రభువు కనబడలేదు ! పేతురూ...... నీవు మమ్మలని నమ్మాలి! యేసు ఇద్దరు శిష్యులకు కనిపించాడు, వారు సంతోషంతో మిగితా శిష్యుల దగ్గరకు వచ్చారు. ప్రభవు సజీవుడై లేచియున్నాడు! ఆయన సీమోనుకు కనిపించాడు! త్రోవలో నడుస్తున్నప్పుడు ఆయన్ని గుర్తించలేకపోయాము. అయితే అయన రొట్టె విరిచి ఇచ్చినప్పుడు ఆయనను గుర్తించాం. ఎమ్మాయు దారిలోనా? అయన అక్కడ కనిపించడం ఎంత ఆశ్చర్యం!. మీకు సమాధానం కలుగును గాక. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? చూడుడి నా చేతులను, పాదములను చూడుడి. నేనే ఆయనను అనుటకు నన్ను తాకి చూస్తే మీకే తెలుస్తుంది. నాకున్నట్టుగా ఎముకలు, మాంసము భూతమునకు ఉండవు. నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నేడు నెరవేరినవి. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాసినవి నేరవేరాలి. లేఖన ప్రకారము; క్రీస్తు తప్పక శ్రమపడి, మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు, మరియు ఆయన పేరట ఇది మొదలుకొని యెరూషలేము మరియు సమస్త జనములలో మారుమనస్సును, పాపక్షమాపణయు ప్రకటింపబడాలి. ఈ సంగతులకు మీరే సాక్షులు. నా తండ్రి వాగ్దానము చేసిన వ్యక్తిని నేనే మీ యొద్దకు పంపెదను. పరిశుధాత్మ శక్తి పొందువరకు మీరు యెరూషలేంలోనే వేచి యుండుడి. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్కనామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు, నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉంటాను. పాపులను రక్షించి, వారిని తనతో సమాధాన పరచడానికి "దేవుడు" మెస్సయ్యను పంపుతాడని, చాలాకాలం క్రితమే ప్రవక్తలు లేఖనాలలో తెలియజేశారు. యేసే ఆ రక్షకుడని ఆయన జీవితం ఋజువుచేస్తుంది. “ఇదిగో, కన్యక గర్భవతియై కుమారుని కనును” అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. దేవుని శక్తిచే కన్యయైన మరియ గర్భము ధరించి యేసుకు జన్మనిచ్చింది. లేఖనాలలో వ్రాయబడినట్లు, దేవుడు ‘నా కుమారుడు’ అని చెప్పిన మెస్సయ్య ఈయనే అని చెప్పడానికి, ఆశ్చర్యకరమైన ఆయన జననమే నిదర్శనం. జనులు యేసును చూచినపుడు, దేవుని స్వభావాన్ని మరియు శక్తిని చూశారు. ఆయన జనులను స్వస్థపరచి, వారి పాపములను క్షమించి, వారికి నిత్యరాజ్యమును అనుగ్రహించెను. యేసు మానవాళి కొరకు బాదించబడి, తన ప్రాణమును బలిగా అర్పించెను. “నా ప్రాణము పెట్టుటకును, దానిని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు” అని క్రీస్తుయేసు చెప్పెను. ఆయన మరణమును జయించి, మరణం కన్నా... తన శక్తి గొప్పదని నిరూపించాడు. తన జీవితం ద్వారా ప్రవక్తల లేఖనాలను నెరవేర్చి, దేవుని పరిశుద్ధ వాక్యము లోపము లేనిది, నిత్యమైనదని యేసు ఋజువుచేశాడు. యేసు దేవుని వాక్యము. యేసు ద్వారా దేవుడు తనను తాను ఈ లోకమునకు బయలుపరచుకొన్నాడు. దేవుడు మొదటగా స్త్రీపురుషులను సృజించినపుడు, సమృద్దియైన జీవమును వారికి అనుగ్రహించెను. అయితే వారు దేవుని నమ్మని వారై, ఆయన ఆజ్ఞకు అవిధేయులయ్యారు. “అందరు పాపము చేశారు.” “పాపానికి వచ్చే ప్రతిఫలం – మరణం.” అని లేఖనము చెప్తుంది. పాపులు దేవునితో సంబంధము కలిగియుండలేరు. అయితే, అబ్రహాము కుమారుని స్థానంలో చనిపోవడానికి ఒక పోట్టేలునిచ్చినట్లుగానే, ఆదాము సంతతి స్థానములో మరణించడానికి దేవుడు యేసును పంపించాడు. యేసునందు విశ్వాసముంచిన వారు దేవుని సన్నిధికి రాగలుగునట్లు దేవుడు ఈ కార్యమును చేశాడు. కనుక యేసునందు విశ్వాసముంచిన వారు నరక శిక్షను తప్పించుకొని, దేవునితో నిత్యం జీవిస్తారు. యేసు, పునరుత్థానుడైన తర్వాత, “తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి, దేవునివైపు తిరుగు వారికి పాప క్షమాపణ గలదని, సకల జనులకు తెలియచేయుడి”. అంతేకాక, తనను వెంబడించేవారికి నిత్యం తోడైయుండి, వారిని సర్వసత్యములోనికి నడిపించడానికి, దేవుని మార్గములో నడవడానికి వారికి తగిన శక్తినిచ్చే పరిశుద్ధాత్మను పంపిస్తానని తన శిష్యుల ద్వారా చెప్పాడు. పాపాత్మురాలైన స్త్రీ, పశ్చాత్తాపపడి, యేసును వెంబడించడం మొదలు పెట్టినప్పుడు, “నీ పాపములు క్షమింపబడియున్నవి. నీ విశ్వాసము నిన్ను రక్షించెను” అని యేసు ఆమెతో అన్నాడు. యేసునందు విశ్వాసముంచుట ద్వారా ఎవరైనా దేవుని కృప చేత రక్షణ పొందవచ్చు. పాపములను క్షమించే అధికారం యేసుకు ఉన్నది. యేసును వెంబడించాలని నిర్ణయించుకున్నవారు, ఈ మాటలద్వారా తమ విశ్వాసమును వ్యక్త పరచి ఆయనతో తమ సంబంధాన్ని ప్రారంభించవచ్చు. ఓ దేవా, నీవు పరిశుద్ధుడవు. నన్ను ప్రేమించినందుకు మీకు వందనాలు. మీ ఆజ్ఞలను అతిక్రమించి, అవిధేయుడనై మీకు విరోధంగా పాపం చేసినందుకు నన్ను క్షమించండి. నా స్థానంలో సిలువపై మరణించడానికి యేసును పంపినందుకు వందనాలు. ఆయన మరణించి తిరిగి లేచినందుకు వందనాలు. నా పాపముల కొరకైన శిక్షను ఆయన భరించినందుకు వందనాలు. ఆ యేసును నా రక్షకునిగా, ప్రభువుగా నా జీవితములోనికి స్వీకరిస్తున్నాను. నీ మార్గములో నడవాలని కోరుకుంటున్నాను. నా పాపములు క్షమించినందుకు నీకు వందనాలు. నేను నిరంతరము మీ రాజ్యములో మీతో ఉండగలుగునట్లు నాకు మార్గము తెరచినందుకు మీకు వందనాలు. నాకు తోడైయుండి, మీ మార్గములో నన్ను నడుపునట్లు మీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి. నా పూర్ణ హృదయముతో మిమ్మును ప్రేమించడానికి, మీకిష్టమైనట్లుగా జీవించడానికి కావలసిన శక్తిని ఆయన నాకు అనుగ్రహించును గాక. లోకమందంతటా, ప్రజలందరూ మిమ్మును స్తుతించుదురు గాక. ఆమెన్ “నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును” అని యేసు తనను వెంబడించే వారిని గూర్చి చెప్పారు. యేసును వెంబడించేవారు, క్రమంగా కలుసుకుంటారు. ప్రతి రోజూ వారు ఆయనతో మాట్లాడతారు. ఆయన వాక్యాన్ని చదువుతారు. ఆయన మాదిరిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. ఇంకా ఇతరులకు యేసును గూర్చి చెప్తారు. వారి హృదయాలలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా యేసు వారిని బలపరచి నడిపిస్తాడు. “పరలోకమందును, భూమియందును నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.... యుగసమాప్తి వరకు సదాకాలము మీకు తోడై యున్నాను” అని పరలోకములోని తన సింహాసనమునకు మేఘముపై ఎక్కి వెళ్లకమునుపు యేసు చెప్పిన మాటను వారు జ్ఞాపకముంచుకుంటారు.
JesusFilm